| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

ఆర్.టి.ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంగల రవీందర్.

డైలీ భారత్, కామారెడ్డి జిల్లా ( భిక్నూర్ ) :  జిల్లా పంచాయతీ అధికారిపై (డిపిఓ) సోమవారం ప్రజా వాణిలో సమాచార హక్కు రక్షణ చట్టం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంగల రవీందర్ ముదిరాజ్ ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఈమెరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ... ఎస్వీ గార్డెన్ ఫంక్షన్ హాల్ అక్రమ అనుమతులు మరియు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ వంటి అంశాలపై డిసెంబర్ 31 నుండి నేటి వరకు లికిత పూర్వకంగా ఫిర్యాదు చేసి నాలుగు నెలలు గడిచిన సంబంధిత  జిల్లా పంచాయతీ అధికారి  స్పందించకపోవడంతో నేరుగా ప్రజావాణిలో డిపిఓ మురళి కృష్ణ పై ఫిర్యాదు చేయడం జరిగింది. సుమారు 8సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు పట్టించుకోలేరు తూతూ మంత్రంగా విచారణ చేసి చేతులు దులుపుకుందామనే ఆలోచనలో ఉన్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. తక్షణమే ఎస్వీ గార్డెన్ ఫంక్షన్ హాల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజావాణిలో సమస్య పరిష్కారం కానందున జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారుల పై  హైదరాబాదులోని చీఫ్ సెక్రటరీ కార్యాలయంతో పాటు లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తానని ఈ సందర్భంగా సమాచార హక్కు రక్షణ చట్టం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంగల రవీందర్ ముదిరాజ్ తెలిపారు.

Previous హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష
Next తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్
ADVERTISEMENT