ఆస్తి కోసం అత్తను హత్య చేసినట్లు నేరం నిరూపణ కావడంతో జీవిత ఖైదీ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించిన సూర్యాపేట జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి.
డైలీ భారత్, సూర్యాపేట: 2020 సంవత్సరం ఆగస్ట్ నెల 29 తేదీన ఆత్మకూరు మండలం రామోజీ తండాకు చెందిన గుగులోతు మీరి అనే 75 సంవత్సరాల వృద్ధురాలిని నిద్రిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఆమె కోడలు గుగులోతు కీరి 55 మహిళ ఇనుప రద్దీతో తలపై కొట్టి హత్యచేసినది. దీనిపై వృద్ధురాలి కూతురు బానోతు ముత్యాలి పిర్యాదు మేరకు ఆత్మకూరు ఎస్ మండల పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగినది. గుగులోతు కీర్తి ఘటనకు పాల్పడిన అని ప్రధాన నిందితురాలిగా చేర్చి అప్పట్టి కేసు దర్యాప్తు అధికారి సూర్యాపేట రూరల్ ఇన్స్పెక్టర్ నిందితురాలు అస్తి కోసం, వృద్ధురాలిని పోషించడం ఇష్టంలేక హత్య చేసినట్లు నేర అభియోగం పత్రాలు కోర్టుకు దాఖలు చేసినారు. ఈ కేసు నందు సాక్షాదారాలను, బాధితులను విచారించిన జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నిందితురాలు నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి జీవిత ఖైదీ జైలు శిక్ష మరియు 2000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. 2,500 రూపాయలు చెల్లించని యెడల అదనంగా మరో నెల రోజుల పాటు జైలు శిక్ష ఉంటుంది అని తీర్పును వెలువరించినారు. ఈ యొక్క కేసు నందు ప్రాసిక్యూషన్ తరపున pp లింగయ్య కేసును వాదించినారు. అందుకు PC శివరామ్ CDO, కోర్టు డ్యూటీ లైజన్ అధికారి శ్రీకాంత్ సహకరించినారు.