| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్

ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్

డైలీ భారత్, వేములవాడ: వేములవాడ పట్టణంలోనీ 10 వార్డు,16 వార్డు రూరల్ మండలం పోచెట్టి పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా అనేక మంది నిరాశ్రయులకు సొంత ఇల్లు నిర్మాణం చేసుకోవడం ఆనందకరమని ఆయన అన్నారు.

Previous డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Next గోవధ నిషేధించాలని జూలూరుపాడు తహసిల్దార్ కు వినతి పత్రం
ADVERTISEMENT