డైలీ భారత్, కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వాసవి మాత జయంతి ఉత్సవాలను కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు.
జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష శతమి నాడు వాసవి మాతా జయంతి ఉత్సవాలను రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సందర్బంగా వాసవి మాతా జయంతి ఉత్సవం ఆదివారం నాడు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు మధుమోహన్ జ్యోతి ప్రజ్వలన గావించి పూలమాల అలంకరించారు.
ఈ కార్యక్రమం లో వైశ్య సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.