| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న డిజిపి

అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న డిజిపి

డైలీ భారత్, కామరెడ్డి:  కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం నాడు  ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  బి. శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి డిజిపి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారితో పాటు ఐ జి పి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గార్లు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ గౌరవ వందనం సమర్పించారు.

Previous సిరిసిల్ల విద్యుత్ శాఖ ఎస్‌ఈగా టి. వేణుమాధవ్ బాధ్యతల స్వీకరణ
Next డబ్బు కోసం క్లాస్‌మేట్‌ కిడ్నాప్‌..
ADVERTISEMENT