| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన ఎంఈవో, స్కూల్‌ అసిస్టెంట్‌

ఏసీబీకి చిక్కిన ఎంఈవో, స్కూల్‌ అసిస్టెంట్‌

డైలీ భారత్, మహబూబాబాద్‌ : జిల్లాలోని గూడూరు మండలానికి చెందిన విద్యాశాఖాధికారితో పాటు స్కూల్‌ అసిస్టెంట్‌ ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యండెడ్‌గా చిక్కారు. రిటైర్ట్‌ ఉద్యోగికి రావాలసిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ బెనిఫిట్స్‌ బిల్లుల కోసం రూ. 15వేలు లంచం తీసుకుంటుండగా వరంగల్‌ యూనిట్‌ ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.

గూడూర్‌ జిల్లా పరిషత్‌ స్కూల్‌లో హెడ్‌మాస్టర్‌గా, ఎంఈవోగా పనిచేస్తున్న అయోధ్యరాం, స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చంద్రమౌళి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి వరంగల్‌ కోర్టు హాజరుపరిచామని ఏసీబీ అధికారులు వివరించారు.

Previous రిలే నిరాహార దీక్ష... దమ్మపేట బీజేపీ పార్టీ
Next ఏసీబీ వలలో ఇన్‌స్పెక్టర్, ఎస్సై
ADVERTISEMENT