| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పోలీసులు వేధిస్తున్నారని HRC కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

పోలీసులు వేధిస్తున్నారని HRC కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

డైలీ భారత్, హైదరాబాద్: నాంపల్లిలోని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఓ మహిళ ఆత్మాఅత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. కవాడిగూడ కు చెందిన శ్రావణి అనే మహిళ తనని గాంధీ నగర్ పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ కమిషన్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకొని పెట్రోల్ బాటిల్‌ను లాక్కున్నారు. సదరు మహిళను హెచ్చార్సీ సిబ్బంది కమిషన్ చైర్మన్ వద్దకు తీసుకెళ్లారు.

ఈ ఘటనతో హెచ్ఆర్సీ కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ వేధింపుల ఆరోపణలపై విచారణ జరుగుతోంది. 

ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Previous " బార్యాభర్తల వివాదాల పరిష్కారం కోసం ఫ్యామిలీ కౌన్సెలింగ్"
Next సర్వే చేయండి ప్రజావాణిలో బాధితుని మొర
ADVERTISEMENT