| Daily భారత్
Logo




TSUTF కు రాజీనామా

News

Posted on 2026-04-05 04:55:57

Share: Share


TSUTF కు రాజీనామా

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు,జిల్లా రాష్ట్ర కమిటీలు వ్యవహరించిన తీరుకు నిరసనగా TSUTF జిల్లా ఆఫీస్ బేరర్ బాధ్యతలకు మరియు సంఘ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పాకాల శంకర్ గౌడ్ ప్రకటించారు.గత దశాబ్ద కాలంగా సంఘ నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేశానని,దాచురి రామిరెడ్డి,నాగటి నారాయణ లాంటి మహానాయకులను స్పూర్తిగా తీసుకొని సంఘ అభ్యున్నతికి, ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేశానని అన్నారు.కాని నేటి రాష్ట్ర,జిల్లా నాయకుల్లో సంఘ నిర్మాణం,నియమాల కంటే వ్యక్తిగత స్వార్థం,పదవీ కాంక్ష, కుల రాజకీయాలు పెరిగాయని,ఉపాధ్యాయుల సమస్యలను, సంక్షేమాన్ని పక్కన పెట్టీ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే సంఘం పనిచేస్తూ, ఉపాధ్యాయులను మోసం చేస్తున్నారని విమర్శించారు.తన భవిష్యత్ కార్యాచరణ ను త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.గత దశాబ్ద కాలంగా చేసిన ఉద్యమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మీడియా మిత్రులకు పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.

Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >
Image 1

డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

Posted On 2026-04-08 19:12:36

Readmore >
Image 1

అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!

Posted On 2026-04-08 17:33:40

Readmore >
Image 1

గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.

Posted On 2026-04-08 17:28:46

Readmore >
Image 1

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 న మెగా రక్తదాన శిబిరం

Posted On 2026-04-08 13:16:01

Readmore >
Image 1

వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం

Posted On 2026-04-08 13:14:54

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-04-08 12:27:46

Readmore >