| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి విశాల షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సినీ నటి నిధి అగర్వాల్

కామారెడ్డి విశాల షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ  కార్యక్రమానికి హాజరైన సినీ నటి నిధి అగర్వాల్

డైలీ భారత్, కామారెడ్డి: సోమవారం రోజున   ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ నటి నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొనిజ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా షాపింగ్‌ మాల్‌లోని పట్టు, ఫ్యాన్సీ చీరల సెక్షన్లు, ఎత్నిక్‌వేర్‌, మహిళలు, పురుషులు, పిల్లల కోసం అందుబాటులో ఉన్న వస్త్రాలను పరిశీలించి సందడి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అధునాతన డిజైన్లతో వస్త్రాలను అందించడంలో అతి పెద్ద షాపింగ్‌మాల్‌గావిశాల నిలిచిందని పేర్కొన్నారు. కామారెడ్డి లో ఏర్పాటు చేసిన స్టోర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు.

ఈ స్టోర్‌లో ఫ్యాన్సీ, కంచి, ధర్మవరం, ఉప్పాడ పట్టు చీరలతోపాటు అధునాతన కలెక్షన్స్‌ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వివిధ శుభకార్యాల్లో ధరించే అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉండడo విశాల షాపింగ్‌ మాల్‌ ప్రత్యేకత అని వెల్లడించారు. నిధి అగర్వాల్ ను చూడడానికి  ప్రజలు ఎగబడ్డారు.


Previous కోటి రూపాయల విలువైన హషీష్ ఆయిల్ స్వాధీనం – ఒకరి అరెస్ట్
Next మట్టివాసనలో మానవత్వం… మంజుల కవిత్వ గాథ
ADVERTISEMENT