| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శీర్షిక : ప్రజా ఐక్యత గీతం

శీర్షిక : ప్రజా ఐక్యత గీతం

డైలీ భారత్ స్పెషల్: శీర్షిక: ప్రజా ఐక్యత గీతం

పర్వత శిఖరములపై పలికిన కవితా నాదమది

పృథ్వీ గర్భమంతట పరిమళించి విరజిల్లె;

భాషల గోడలన్నియు భగ్నమగునని బోధించి

భావాల సేతువై మానవ హృదయములను కలిపె.

కులమత భేదముల కలుషిత చీకటిలో

కరుణా కాంతిరేఖలై కవిత వెలుగె;

విభేద వలయముల విరిచి సమత్వ మార్గమున

సామరస్య సుగంధమై సమాజమున పరచె.

పేదవాని నిశ్వాసము, ధనవాని గర్వగీతము

ఒకే రాగమై కలిసిన క్షణమున

సమానత్వ సత్యమై సమాజ గర్భమందు

స్నేహ స్వరమై సర్వలోకమున మార్మోగె.

సరిహద్దు రేఖలతో భూమిని చీల్చిన చేతులకన్నా

స్నేహసూత్రమే శాశ్వతమని కాలమే చెప్తుంది;

మనసుల నదులన్నియు ఒకే సముద్రమై చేరగా

మానవత్వమే జగతికి మహాసంగీతమవుతుంది.

కావున కవిత కేవలం పదాల అలంకారముకాదు—

ప్రజల హృదయాలను కలిపే పవిత్ర జ్యోతి అది;

ప్రపంచ కవితా స్వరమై మార్మోగిన వేళ

ప్రజల ఐక్యత రాగమే భూమికి శాశ్వత గీతమవుతుంది.

రచన: మంజుల పత్తిపాటి 

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

చరవాణి 9347042218

Previous ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా అదనపు కలెక్టర్ కె.శ్రీనివాస్
Next రామంతపూర్ బగయత్ పరిధిలోని వెంకట సాయి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం
ADVERTISEMENT