| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం

ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పునః నిర్మించిన తెలంగాణ శాసన మండలి లో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. శనివారం మహేందర్ రెడ్డి, సతీమణి పట్నం సునీత రెడ్డి, కుమార్ రినీష్ రెడ్డి తో కలిసి మండలి కార్యదర్శి నర్సింహా చార్యులు వేద పండితులు పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆయన తన ప్రధాన ఛాంబర్ లో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా సెక్రటరీ నర్సింహా చార్యులు చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కి బోకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కార్యాలయ సిబ్బంది పేషీలో పూజలు చేశారు. అధికారులు ఉపేందర్ రెడ్డి, సుధాకర్, చీఫ్ మార్షల్ సంజీవరెడ్డి,పీఎస్ ప్రకాష్,అడీషనల్ పీఎస్ నాగిరెడ్డి, పీఆర్ఓ మల్లారెడ్డి, పీఏలు బాలు, రాజు, రాజేందర్ రెడ్డి, వంశి తదితరులు పాల్గొన్నారు.

Previous జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Next వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య వినతికి కేంద్రం స్పందన
ADVERTISEMENT