Posted on 2026-03-14 17:37:18
పోలీస్ శాఖలోనూ ప్రజా సంబంధాల విభాగం దివంగత డిజిపి హెచ్ .జె దొర దూరదృష్టికి నిదర్శనం
డైలీ భారత్, హైదరాబాద్: పోలీస్ శాఖ అంటే కేవలం నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాదు, ప్రజలతో మమేకమై వారి నమ్మకాన్ని చూరగొన్నప్పుడే ఆ వ్యవస్థకు పరిపూర్ణత లభిస్తుందని నమ్మిన అధికారి దివంగత డిజిపి హెచ్.జె.దొర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ప్రజా సంబంధాల విభాగం మరియు పోలీస్ పి.ఆర్.ఓల వ్యవస్థ ఆయన దూరదృష్టికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. 2000 సంవత్సరం ప్రారంభంలో పోలీస్ అధికారుల వాణిని, శాఖా పరమైన విజయాలను విస్పష్టంగా ప్రజలకు తెలియజేయాలనే సంకల్పంతో ఆయన ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితులే ఈ విభాగం ఏర్పాటుకు ప్రధాన ప్రేరణగా నిలిచాయి.
ముఖ్యంగా సిపిఐ (ఎం.ఎల్) పీపుల్స్ వార్ కార్యకలాపాలు రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా సాగుతున్న ఆ రోజుల్లో, నక్సలైట్లు తమ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి వినూత్న పద్ధతులను అనుసరించేవారు. వారు స్వయంగా ప్రజా కోర్టులను నిర్వహించడమే కాకుండా, కొరియర్ల ద్వారా వివిధ అంశాలను ఎప్పటికప్పుడు పత్రికలకు చేరవేస్తూ ప్రజల్లోకి వెళ్లేవారు. మరోవైపు, నక్సలైట్లకు మద్దతుగా వివిధ కళా బృందాలు, కళాకారులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రచారం చేస్తూ ప్రజలను ప్రభావితం చేసేవారు. పోలీస్ అధికారులకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాలలో వాస్తవాలను తెలియజేసేందుకు వేదిక అవసరమని నాటి డిజిపి హెచ్ జె దొర గ్రహించారు. సమర్థవంతంగా పనిచేయడమే కాదు ఆ విధానాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అభిలాషించారు. ఈ నేపథ్యంలో సమాచార యుద్ధంలోనూ పైచేయి సాధించాలని భావించిన హెచ్.జె.దొర , పోలీస్ శాఖ తీసుకుంటున్న ప్రజాహిత చర్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు.
ఈ వ్యూహంలో భాగంగానే అన్ని జిల్లాల్లో జర్నలిస్టులుగా అనుభవం, అర్హత కలిగిన వారిని పోలీస్ పి.ఆర్.ఓలుగా నియమించి, పద్ధతి ప్రకారం సమాచార వ్యవస్థను బలోపేతం చేశారు. ఎప్పటికప్పుడు వాస్తవాలను పోలీస్ శాఖ తరఫున మీడియా ద్వారా ప్రజలకు చేరవేసేందుకు ప్రజా సంబంధాల వ్యవస్థ పని చేసేది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు చట్టవ్యతిరేక కార్యకలాపాల వైపు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు, పోలీసుల తరపున ప్రత్యేక కళా బృందాలు అప్పటికే వరంగల్ డిఐజిగా హెచ్ జె దొర ఉన్నప్పుడు ప్రారంభమైన కళా బృందాలను మిగిలిన ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేశారు. వరంగల్ కరీంనగర్ జిల్లాల్లో ఈ కళాబృందాలు విస్తృతంగా గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేవి. 2001 వ సంవత్సరంలో నాడు నల్గొండ జిల్లా ఎస్పీగా ఉన్న డిజిపి బి . శివధర్ రెడ్డి పోలీసు సిబ్బందితో దీటైన కళాబృందాన్ని ఏర్పాటు చేసి పీపుల్స్ వార్ కార్యకలాపాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.ఈ బృందాలు పల్లెపల్లెనా తిరుగుతూ చైతన్య కార్యక్రమాలు నిర్వహించి, హింస వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ప్రజలను చట్టబద్ధమైన జీవనం వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించాయి. నాడు ఆయన నాటిన ఆ మొక్క నేటికీ సోషల్ మీడియా యుగంలోనూ పోలీసులకు, సామాన్యులకు మధ్య వారధిలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. పోలీసు శాఖ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి ప్రజా కేంద్రీకృత పోలీసింగ్‌ను సాకారం చేసేందుకు ప్రజా సంబంధాల విభాగం దోహదపడుతుంది.
మహిళల భద్రతే లక్ష్యం – ప్రజల్లో చైతన్యం నింపుతున్న కామారెడ్డి షీ టీమ్
Posted On 2026-06-07 13:06:00
Readmore >
ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా “ఫిట్ ఇండియా మూవ్‌మెంట్” సైక్లింగ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-07 13:04:42
Readmore >
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >