| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు

సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు

 వదంతులు, అసత్య ప్రచారాలు నమ్మవద్దు

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిలిండర్ల పంపిణీ, స్టాక్ తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కమిటీ సభ్యులు, సిలిండర్ ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీ జిల్లా చైర్మన్ గా కలెక్టర్, కన్వీనర్ గా జిల్లా పౌరసరఫరాల అధికారి, సభ్యులుగా వివిధ శాఖల అధికారులు ఉంటారని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో సిలిండర్ల నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పడవద్దని, వదంతులు నమ్మవద్దని సూచించారు. గృహ వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సూచించిన ధరలకు మాత్రమే సిలిండర్లను విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్లు, అనాథ శ్రమాలు, ఆస్పత్రులకు ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 

ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించవద్దని, బ్లాక్ దందా చేయవద్దని సూచించారు. సిలిండర్ పక్కదారి పట్టినా.. బ్లాక్ దందా చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 

సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాధాభాయ్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, అఫ్జల్ బేగం, సౌజన్య, రూపేష్, లక్ష్మీరాజం, రజిత, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.


#Sircilla #GasCylinder #sircillacollector #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_district

Previous రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Next వెంకటాపూర్ శివారులో జూదం స్థావరం పై పోలీసుల దాడి
ADVERTISEMENT