| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

అంగన్వాడీ  కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

డైలీ భారత్, సిరిసిల్ల:  అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. 

సిరిసిల్ల పట్టణం అశోక్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు రిజిస్టర్ తనిఖీ చేసి, మొత్తం ఎందరు పిల్లలు ఉన్నారు? రోజూ ఎందరు వస్తున్నారో ఆరా తీశారు. పలువురు పిల్లల తల్లులతో మాట్లాడి.. గుడ్డు, పోషకాహారం ఇస్తున్నారా అని అడిగి తెలుసు కున్నారు. అనంతరం పిల్లల ఎత్తు, బరువు కొలిచిన వివరాలు, ఆన్లైన్ అలాగే రిజిస్టర్ నమోదు చేసిన వివరాలు పరిశీలించారు. కేంద్రం లో నిలువు ఉన్న గుడ్లు, బాలా అమృతం తనిఖీ చేశారు. పిల్లల ఎత్తు, బరువు కొలిచే యంత్రాల పనితీరు పరిశీలిం చారు.ఈ సందర్భం గా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు రోజూ వచ్చేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిం చాలని సూచించారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు.

Previous అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్
Next కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
ADVERTISEMENT