| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అశ్వాపురంలో ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

అశ్వాపురంలో ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

డైలీ భారత్, అశ్వాపురం: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. పరీక్షల నిర్వహణలో భాగంగా కళాశాల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రం వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, నియమ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేశారు. పరీక్షల చివరి రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ శేషుబాబు  తెలిపారు.

Previous నేటి నుంచి వెహికల్ రిజిస్ట్రేషన్‌లకు కొత్త విధానం
Next జేకే మల్టీకేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ల్యాప్రోస్కోపిక్ సెంటర్ ప్రారంభం
ADVERTISEMENT