రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ఉపవాసాల సందర్భంగా (పాత పాల్వంచలోని మజిద్-ఎ-మహ్మదీయ మజిద్ లో మంగళవారం రాత్రి కొత్వాల తోపాటు ఆయన సతీమణి 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి దంపతులు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుఏర్పాటు చేశారు. మజిద్ కమిటీ సభ్యులు కొత్వాల ను పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ఎంతో నియమ నిష్టలతో ముస్లింలు ఉపవాస దీక్షలు చేస్తారని, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మజిద్ కమిటీ సభ్యులు షేక్ జానీమియా, షేక్ ఖాజామియా, షేక్ ఖయ్యుమ్, MD ఇమామ్, షేక్ యాకుబ్, షేక్ హయమత్ , షేక్ షాకీర్, షేక్ నజీర్, సయ్యద్ యాకుబ్, కరీమ్, ఖుర్షిద్, వాసుమల్ల సుందర్ రావు, వనమా చినబాబు, చిన్న పండు, తిరుపతి, యాటా నాని, యాదా నరసింహారావు తదితరులుఈ కార్యక్రమంలోపాల్గొన్నారు