Posted on 2026-03-10 19:34:32
నీల నాగరాజు బీసి సంఘం జిల్లా అధ్యక్షులు..
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహానికి 129 వర్ధంతి సందర్భంగా బీసి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సావిత్రిబాయి పూలేని సామాజికంగా చదువుల తల్లిగా కొలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఆమె ఒక విప్లవ నాయకురాలు సంఘసంస్కర్త.భారత దేశంలో మహిళా సాధికారత ప్రతిరూపం.
సావిత్రిబాయి పూలే విద్యారంగానికి మరియు సామాజిక న్యాయంగానికి చేసిన విశిష్ట సేవలకు విద్యామాతగా కీర్తించబడ్డారు.ఆమె తన భర్త జ్యోతిరావు పూలే తో కలిసి కఠినమైన సామాజిక నిబంధనలు మరియు పక్షపాతాలను ధిక్కరిస్తూ భారతదేశంలో మహిళా విద్యకు పునాది వేసింది. బాలికల విద్య కోసం సావిత్రిబాయి పూలే 1848 లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించింది.అది భారతదేశంలోని మహిళల విద్య కోసం ప్రారంభించిన సాహసోపేతమైన అడుగు అని అణిచివేతకు వ్యతిరేకంగా విద్యని విముక్తి సాధనంగా స్వీకరించాలని కోరుతూ అట్టడుగు వర్గాలను ప్రేరేపించడానికి ఆమె శక్తివంతమైన రచనలను,కవిత్వాలను రచించారు.
మహిళలకు విద్య నిషిద్ధమని భావించిన కాలంలో సావిత్రిబాయి బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలను ప్రారంభించడం ద్వారా వారి కోసం సమాజంలో విద్యా అందరి హక్కు అని తెలియపరిచారు. సామాజిక నిబంధనలను ధిక్కరించింది మరియు విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొంది కానీ తన లక్ష్యంతో స్థిరంగా ముందుకు కదిలింది.
మీరు ఒక పురుషునికి విద్యానందిస్తే మీరు ఒక వ్యక్తికి విద్యను అందిస్తారు. కానీ మీరు ఒక స్త్రీకి విధ్యను అందిస్తే, ఒక కుటుంబాన్ని మరియు దేశాన్ని విద్యావంతులను చేస్తారు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు,సంక్షేమ సంఘం అధ్యక్షులు సాప శివరాములు,ప్రధాన కార్యదర్శి కుంబాల లక్ష్మణ్ యాదవ్,ఎస్. దయాకర్,జబ్బార్ నాయక్,వినోద్ నాయక్,ప్రవీణ్,సురేష్,అర్చన,భార్గవి తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >