| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలి : సి.కలెక్టర్ నారాయణ రెడ్డి

మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలి : సి.కలెక్టర్  నారాయణ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా కలెక్టర్  నారాయణ రెడ్డి మహిళా దినోత్సవ సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలు , 

మహిళలు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టితో చేపట్టిన వందరోజుల ప్రత్యేక ఆరోగ్య సేవల కార్యక్రమాలు మరియు జిల్లాలో అమలు జరుగబోతున్న హెచ్ పి వి టీకా కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జిల్లా కార్యాలయ సముదాయంలో కొంగరకలాన్ వద్ద మహిళా ఉద్యోగులు మరియు ఇతరులకు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు స్క్రినింగ్ పరీక్షలు మరియు అవసరమైన వైద్య సేవలు అందించబడతాయనీ, 

అదనంగా జిల్లాలో 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం మొదటి దశలో మాతృ ఆరోగ్యము శిశు ఆరోగ్యము మరియు వృద్ధులు ఆరోగ్యం పై ప్రత్యేక చర్యలు చేపట్టబడుతున్నాయి గర్భిణీ స్త్రీల పర్యవేక్షణ పిల్లల ఆరోగ్య పరీక్షలు మరియు వృద్ధుల అవసరమైన వైద్య సేవలు సమగ్రంగా అందించేందుకు కార్యాచరణ రూపొందించబడినది.

అలాగే బాలికల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా హెచ్ పి వి టీకా కార్యక్రమము సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాల ద్వారా జిల్లాలో మహిళల ఆరోగ్యం మెరుగుపడేలా సమన్వయంతో పని చేయాలని సూచించారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో అదనపు జిల్లా కలెక్టర్ చంద్రా రెడ్డి ,జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలిత దేవి పాల్గొన్నారు.

Previous కామని దాహణంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్
Next వందేళ్ల తర్వాత హోలీ రోజున చంద్రగ్రహణం.. విశిష్టత ఇదే
ADVERTISEMENT