| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మధ్యప్రాచ్య పరిస్థితులపై అప్రమత్తం

మధ్యప్రాచ్య పరిస్థితులపై అప్రమత్తం

తెలంగాణ భవన్‌లో 24×7 కంట్రోల్ రూమ్

డైలీ భారత్, హైదరాబాద్: మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా) దేశాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో తెలంగాణ భవన్ అధికారులు నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులు లేదా వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:

వందన బరువా – 9871999044

సీహెచ్. చక్రవర్తి – 9958322143

జావేద్ హుస్సేన్ – 9910014749

రక్షిత్ నాయక్ – 9643723157

తెలంగాణ ప్రభుత్వం పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంది.

Previous భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Next గల్ఫ్ దేశాలల్లో ఉద్రిక్త పరిస్థితులు
ADVERTISEMENT