| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అక్రమ సారాయి విక్రేత అరెస్ట్, నిందితుడిని రిమాండ్ తరలింపు

అక్రమ సారాయి విక్రేత అరెస్ట్, నిందితుడిని రిమాండ్ తరలింపు

ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవు

గాంధారి ఎస్హెచ్ఓ  బి. ఆంజనేయులు

డైలీ భారత్, గాంధారి: గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధారి మండలం రామలక్ష్మణ పల్లి గ్రామంలో అక్రమంగా సారాయి తయారు చేసి విక్రయిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంపై గాంధారి ఎస్హెచ్ఓ బి ఆంజనేయులు, వారి సిబ్బంది ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన మెరుపు దాడి నిర్వహించారు.

ఈ దాడిలో గ్రామానికి చెందిన లాకావత్ రాము అనే వ్యక్తి తన నివాసంలో చట్టవిరుద్ధంగా సారాయిని నిల్వ ఉంచినట్లు గుర్తించారు. సోదాలు నిర్వహించగా, ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోని ఎయిర్ కూలర్‌లో దాచిపెట్టిన సుమారు 4 లీటర్ల నాటు సారాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.

అరెస్టు చేసిన నిందితుడు లాకావత్ రామును ఈరోజు గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించడం జరిగింది.

ఈ సందర్భంగా గాంధారి ఎస్సై బి. ఆంజనేయులు మాట్లాడుతూ, అక్రమంగా సారాయి తయారు చేయడం, నిల్వ ఉంచడం లేదా విక్రయించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నాటు సారాయి ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని, ఇటువంటి కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ నిరంతరం నిఘా ఉంచుతుందని తెలిపారు.

అలాగే, ప్రజలు తమ పరిసరాల్లో ఎక్కడైనా అక్రమ సారాయి తయారీ లేదా విక్రయాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని గాంధారి ఎస్సై బి. ఆంజనేయులు కోరారు.

Previous వంద తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్లు : ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి
Next డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసుల కఠిన చర్యలు
ADVERTISEMENT