రక్తదానానికి యువత ముందుకు రావడం అభినందనీయం
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో ఎల్లారెడ్డి కి చెందిన వృద్ధుడు ప్రభులు (80) కి అనీమియా వ్యాధితో బాధపడుతున్నందుకు వారికి కావాల్సిన రక్తాన్ని ఐవిఎఫ్ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఎర్రం ఈశ్వర్ గుప్త సహకారంతో పట్టణానికి చెందిన చీటి నిఖిల్ రావ్,మహిత్ గౌడ్ లు మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. రక్తదానంతో యువతకు ఆదర్శంగా నిలిచిన రక్తదాతలు నిఖిల్ రావ్,మహిత్ గౌడ్ లకు అభినందనలు తెలియజేశారు.