Posted on 2026-01-31 07:02:09
13వ వార్డులో ఆధార్ పార్టీ తరఫున బరిలోకి :రాయల పోలయ్య
డైలీ భారత్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం అశ్వరావుపేటలో మున్సిపల్ ఎన్నికలు ప్రజాసేవ కోణంలో కొత్త మలుపు . ఈ ఎన్నికల్లో 13వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా ఆధార్ పార్టీ తరఫున బరిలోకి దిగిన రాయల పోలయ్య ప్రత్యేక ఆకర్షణగానిలుస్తున్నారు.సుదీర్ఘకాలంగా జర్నలిస్టుగా ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకొచ్చిన కలం వీరుడు రాయల పోలయ్య అశ్వరావుపేట ప్రజలకు కొత్త పరిచయం కాదు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు నిజాయితీగా పేరు ప్రతిష్టలు సంపాదించి అందరిని కలుపుకొని పోయే మనస్తత్వం, స్పష్టమైన మాట తీరు, ప్రజల పట్ల నిబద్ధత ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి.మొట్టమొదటిసారిగా అశ్వరావుపేటలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో, మూడవ రోజు నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన రాయల పోలయ్య, గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగారు. జర్నలిస్టుగా సమస్యలను ప్రశ్నించిన అనుభవాన్ని, కౌన్సిలర్‌గా పరిష్కారాలుగా మార్చాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.“ప్రజల గొంతుకగా కలం పనిచేసింది… ఇప్పుడు అదే గొంతుకకు అధికార బలం కల్పించాలన్నదే నా ఆశయం” అని పోలయ్య స్పష్టం చేస్తున్నారు. వార్డు అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజలకు అందుబాటులో ఉండే కౌన్సిలర్‌గా పనిచేయడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు.13వ వార్డు ఓటర్లు తనపై నమ్మకం ఉంచి ఆశీర్వదించాలని, ఈ మార్పులో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని మీడియా ద్వారా రాయల పోలయ్య విజ్ఞప్తి చేస్తున్నారు.కలం పట్టిన చేతికి ఇప్పుడు ప్రజల మద్దతు లభిస్తే, 13వ వార్డులో నిజమైన ప్రజాపాలనకు బాటలు వేయవచ్చన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-11 13:57:25
Readmore >
సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Posted On 2026-08-11 07:54:33
Readmore >