Posted on 2025-12-29 13:49:49
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం షాబాద్ మండలం అప్పరెడ్డిగూడ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ పోలేపల్లి సందీప్ గౌడ్,ఉపసర్పంచ్ శరత్ కుమార్ తో పాటు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచులు ప్రజలతో సమన్వయంగా పని చేస్తూ ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ సందీప్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు.గ్రామంలోని మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, మరియు ఇతర అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నూతన పాలకవర్గం ముక్తకంఠంతో ఆయన హామీ ఇచ్చింది.ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్పంచులు గుండాల అశోక్, ఈగ ప్రభాకర్ రెడ్డి, స్వరూప మహేందర్ గౌడ్,కుమ్మరి లావణ్య చెన్నయ్య, తాళ్ల మాణిక్యం గౌడ్,షాబాద్ ఉపసర్పంచ్ దండు రాహుల్ గుప్తా, సర్దార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంజీవరెడ్డి ,మాజీ సర్పంచులు బేగరి ఆంజనేయులు, బండ సతీష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, సుభాష్ రెడ్డి , గంధం గౌరీశ్వర్ ముదిరాజ్, శేఖర్, శాగంటి శ్రీనివాస్, విష్ణువర్ధన్ రెడ్డి, మైపాల్ రెడ్డి, రాజు, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ,ఆంజనేయులు, శ్రీకాంత్ రెడ్డి, కావలి శ్రీరాములు, సత్తయ్య, గ్రామ పెద్దలు,నాయకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 16:25:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 15:47:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 15:46:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 15:20:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 15:11:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 15:09:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 12:50:34
Readmore >