| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

డైలీ భారత్, శ్రీకాకుళం జిల్లా:శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు  సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వెళ్తున్న  ప్రైవేట్ ట్రావెల్ బస్సును వెనుక నుంచి మరో బస్సు ఢీకొంది.

ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ఘటనా స్థలంలో మృతి చెందగా... సుమారు 30 మంది యాత్రికులు గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న 108, 1033 అంబులెన్స్లలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నేషనల్ హైవే సిబ్బంది ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తూ... క్రేన్ సహాయంతో వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం అనుపూర్ జిల్లాకు చెందిన సుమారు 150 మంది యాత్రికులు రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులలో పూరి దర్శనం అనంతరం అన్నవరం దర్శనానికి వెళుతుండగా.ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది.

పలాస మండలం మొగిలిపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న మరుగుదొడ్లను యాత్రికులు వినియోగించుకునేందుకు బస్సు రహదారిపై డ్రైవర్ ఆపడంతో.. ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న కాశీబుగ్గ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటన పై కేసు నమోదు చేశారు.

Previous హుస్నాబాద్ జాతీయ రహదారిపై నాలుగు పల్టీలు కొట్టిన కారు
Next వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
ADVERTISEMENT