బేబీ పౌడర్ వాడకంతో ఇద్దరు మహిళలకు క్యాన్సర్
క్యాన్సర్ రిస్క్ గురించి హెచ్చరించలేదన్న న్యాయస్థానం
జాన్సన్ అండ్ జాన్సన్‌కు రూ.330 కోట్ల జరిమానా
కాలిఫోర్నియా జ్యూరీ సంచలన తీర్పు
డైలీ భారత్ న్యూస్, ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్‌కు అమెరికా కోర్టులో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన బేబీ పౌడర్ వాడకం వల్ల తమకు ఒవేరియన్ క్యాన్సర్ వచ్చిందని ఇద్దరు మహిళలు దాఖలు చేసిన కేసులో వారికి అనుకూలంగా తీర్పు వెలువడింది. క్యాన్సర్ ముప్పు గురించి వినియోగదారులను హెచ్చరించడంలో కంపెనీ విఫలమైందని నిర్ధారించిన కాలిఫోర్నియా జ్యూరీ, బాధితులకు 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ.330 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.