డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : కొందుర్గ్ మండలంలోని శ్రీరంగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన బ్యాగరి రమేష్, ఉప సర్పంచ్ సయ్యద్ ముస్తఫా వార్డు మెంబర్ లను శుక్రవారం షాద్ నగర్ నియోజకవర్గం యువజన సంఘం అధ్యక్షులు ఆశన్నగారి మధుకర్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉపసర్పంచ్ మాట్లాడుతూ సర్పంచ్ , ఉపసర్పంచ్ గా ఎన్నుకున్నందుకు గ్రామ అభివృద్ధికి ఐక్యంగా పని చేస్తాం అని అన్నారు . గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సయ్యద్ సాదిక్,అశోక్ రెడ్డి, భుజంగారెడ్డి,వార్డు సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
News
శ్రీరంగాపూర్ గ్రామ సర్పంచ్ ఉపసర్పంచ్ ను సన్మానించిన ఆశన్నగారి మధుకర్ రెడ్డి