| Daily భారత్
Logo




ప్రచారంలో దూసుకుపోతున్న వజ్జా ఈశ్వరి

News

Posted on 2025-12-11 08:13:22

Share: Share


ప్రచారంలో దూసుకుపోతున్న వజ్జా ఈశ్వరి

జోరుగా..హుషారుగా ఎన్నికల ప్రచారం

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం నియోజకవర్గ లక్ష్మిదేవిపల్లి  ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి చాతకొండ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని సిపిఐ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వజ్జా ఈశ్వరి అన్నారు. చాతకొండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న వజ్జా ఈశ్వరి ప్రచారంలో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ దూసుకుపోతున్నారు. అందరికి సుపరిచితురాలైన ఈశ్వరి గ్రామ ఓటర్లను తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు.  "ఉంగరం" గుర్తుతో పోటీ చేస్తున్న ఈశ్వరి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ఆశీస్సులతో ఎన్నికల బరిలో దూసుకుపోతుంది. తన ప్యానెల్ అభ్యర్థులు, మద్దతు దారులతో కలిసి విస్తృతంగా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తినైన తనను గెలిపిస్తే చాతకొండ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఉన్నత స్థానానికి తీసుకొచ్చే బాధ్యత తనదని, ఉంగరం గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాన‌న్నారు. గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానని, వీధిలైట్లు, డ్రైనేజీ, నీటి సమస్య, సీసీ రోడ్లల నిర్మాణాల కోసం స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎటువంటి పక్షపాత వైఖరి లేకుండా కేవలం అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లను కేటాయింపు జరిగేలా చూస్తానని, మీ ఊరి మనిషిగా చాతకొండ గ్రామ ప్రజలు తనను ఆదరించి, అభిమానించి మీ ఆశీర్వాదాన్ని, మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో పంచాయతీ బరిలో ఉన్న వార్డు సభ్యులు, మంద కమలయ్య (గాబ్రీయేలు), షేక్ షబానా,  ఈసాల లత, వజ్జా రాజేశ్వరి, కోరం జ్యోతి, ఏర్పల సరితా దాస్, గుమ్మడి అనురాధ, వేముల శ్రీనివాస్, కోరం నర్సింహారావు, రామగిరి సాయిబాబు, బిఆర్ఎస్ నాయకులు శేషాద్రి వినోద్, మరియు స్థానికులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >