| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రియల్టర్ దారుణ హత్య

రియల్టర్ దారుణ హత్య

డైలీ భారత్ న్యూస్, కాప్రా: హైదరాబాద్ నగరంలో పట్టపగలు దారుణం జరిగింది. దమ్మాయిగూడలోని సాకేత్ కాలనీలో ఉదయాన్నే కొంతమంది దుండగులు ఒక వ్యక్తిని  అతికిరాతంగా పొడిచి పొడిచి  చంపారు. మృతి చెందిన వ్యక్తి కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని సాకేత్ కాలనీకి చెందిన వెంకటరత్నం (46) రియాల్టర్‌గా గుర్తించారు.

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రియల్టర్ వెంకటరత్నం..  స్కూటీపై తన కూతురిని స్కూలుకి తీసుకెళ్తుండగా ఐదుగురు  దుండుగులు వెనుక నుంచి కారుతో ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు.  ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థాలానికి చేరుకున్నారు.  దుండుగులు వెంబడించి మరీ చంపినట్లు స్థానికులు చెబుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  రియల్టర్ వెంకటరత్నంపై గతంలో ధూల్ పేట్ స్టేష్టన్‌లో రౌడీషీట్ ఉన్నట్లు గుర్తించారు. ఆయనపై రెండు హత్యలు చేయగా.. నిందితుడిగా ఉన్నారన్నారు. అయితే ఆయనను ఆ హత్యకు సంబంధించి ప్రత్యర్థులే చంపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు

Previous అన్ని దేవుళ్ళపై ఒట్టేసి మాట తప్పిన ప్రభుత్వం కాంగ్రెస్
Next ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా
ADVERTISEMENT