డైలీ భారత్ న్యూస్,రాజన్న సిరిసిల్ల జిల్లా: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదివారం పరిశీలించారు. వేములవాడ రూరల్ మండలంలోని ఫాజుల్ నగర్ వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తనిఖీ చేశారు. రిజిస్టర్లు పరిశీలించి, వాహనాల తనిఖీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెక్ పోస్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వాహనాల తనిఖీలో క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.
News
ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్