డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఎవరు లేని అనాధ మృతదేహాలకు ఆత్మబందువులై అంత్యక్రియలను సంప్రదాయ పద్దతిలో నిర్వహిస్తు మానవత్వం చాటుకుంటున్నారు జిల్లాకు చెందిన ఇందూరు యువత స్వచ్చంద్ద సేవ సంస్థ సభ్యులు. అంతేకాకుండా అంతరించిపోతున్న మానవత్వం విలువలను నేటి తరానికి తెలియ చెబుతూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు.
గత 6 రోజుల క్రితం అనారోగ్యంతో రోడ్డు పై కన్నుమూసినా ఓ అనాధ వృద్దురాలు ఆమెకి సంబంధించిన సంబంధికులు ఎవరు లేకపోవడంతో అంతక్రియలకు సంబంధించి 4వ ఠణా పోలీస్ సిబ్బంది ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థను కోరగా శుక్రవారం సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను శుక్రవారంనిర్వహించడం జరిగిందని ఇందూరు యువత వ్యవస్థాపక అధ్యక్షులు మద్దూకూరి సాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి జయదేవ్ వ్యాస్, ఇందూరు శేఖర్, దర్శనం రాజు, 4వ ఠణా పోలీస్ సిబంద్ది నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.