డైలీ భారత్, జగిత్యాల: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం జగిత్యాలకు రానున్నారు. చల్‌గల్ మామిడి మార్కెట్‌లో నిర్వహించే జగిత్యాల నియోజకవర్గ బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇదే వేదికగా కాంగ్రెస్ నుంచి ముఖ్య నాయకులు గులాబీ పార్టీలో చేరనుండగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించనున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్న కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు అంతా సిద్ధం చేశారు.
ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఏర్పాట్లను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పరిశీలించి, సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు....