| Daily భారత్
Logo




మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడి ఎన్నికతో మాజీ మేయర్ సంజయ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టనున్నారా..?

News

Posted on 2025-11-22 10:12:06

Share: Share


మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడి ఎన్నికతో మాజీ మేయర్ సంజయ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టనున్నారా..?

ఇకపై తండ్రి బాటలోనే నడుస్తానంటున్న సంజయ్ కి అంతా కలిసొచ్చేనా..?

రేపు జరగబోయే స్వీకార కార్యక్రమానికి తన సోదరుడు వచ్చేనా..?

జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మాజీ మేయర్, మున్నూరు కాపు నూతన జిల్లా అధ్యక్షుడు సంజయ్ ప్రమాణ స్వీకారం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఒకప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఓ చక్రం తిప్పిన మాజీ రాజ్యసభ సభ్యుడు,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు,డి. శ్రీనివాస్ గతకొన్నాళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.. అయితే అయిన వారసులుగా అప్పటి మాజీ నగర పాలక సంస్థ తొలి మేయర్ ధర్మపురి సంజయ్, ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లు పార్టీలు వేరైనా అటు కుటుంబ పరంగా ఇటు రాజకీయాల పరంగా వైరం కొనసాగుతూ వచ్చింది. ఇక డిఎస్ మృతి చెందిన తర్వాత  ప్రత్యక్ష రాజకీయాలకు ఉంటూ తనకంటూ ఒక ఒక ఈమేజింగ్ పెంచుకొని ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని రాజకీయాలకు అతీతంగా పేదింటి ఆడబిడ్డలకు తానున్నానంటూ విస్తృతంగా సేవా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ లో చేరిన డి సంజయ్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూనే వచ్చారు. ఆ తర్వాత తన తండ్రి అడుగుజాడల్లోనే నడవాలంటే కృత నిశ్చయంతో తన తండ్రి నీ ఏ పార్టీ గౌరవించిందో అదే పార్టీలోకి వెళ్లాలని ధృడసంకల్పంతో తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న డి. సంజయ్ ఇప్పటివరకు అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. తనకు పదవుల కంటే తన తండ్రి చివరి వరకు ఏ పార్టీని నమ్మి తుది శ్వాస విడిచారో అదే పార్టీలో తాను కూడా కొనసాగాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు కొనసాగుతూనే వచ్చారు. ఈ క్రమంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో డి సంజయ్, అరవింద్ సోదరుల మధ్య పార్టీలపరంగా విభేదాలు కాకుండా వ్యక్తిగతంగా కూడా విభేదాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల మాజీ మేయర్ డి సంజయ్ కు మున్నూరుకాపు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియామకం అవ్వడంతో ఇటీవల ఏర్పాటు చేసిన ఓ పత్రికా సమావేశంలో సంజయ్ ఇకపై తన తండ్రి అడుగుజాడలోనే తాను నడుస్తానని ఆయన అన్నారు. ముఖ్యంగా నన్ను నమ్ముకున్న మునురుకాపు బిడ్డలకు న్యాయం చేయడంతో పాటు, ఇతర పేద ప్రజలకు కూడా తాను న్యాయం చేస్తానని పేర్కొన్నారు. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ బిజెపి  బీ ఆర్ ఎస్ పార్టీ అగ్ర నేతలను కూడా ఆదివారం ముఖ్యంగా అసెంబ్లీ స్పీకర్ను కూడా ఆహ్వానిస్తున్నట్లు ఆ పత్రిక ప్రకటనలో సంజయ్ తెలిపారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇదే సమయంలో బిజెపి ఎంపీ అరవింద్ ను కూడా ఆహ్వానిస్తానని, బీ ఆర్ ఎస్ ముఖ్య రాష్ట్ర నేతలను కూడా ఆహ్వానించడం జరుగుతుందని ఆ ప్రకటనలో డి సంజయ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అసలే అన్నదమ్ములకి రాజకీయంగా కుటుంబ పరంగా ఏమాత్రం పడని వారిద్దరూ ఒకే వేదికపై కలుస్తారా...? అసలు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రానున్నారా అనేది నిజామాబాద్ జిల్లా వాసుల్లో చర్చనీయాoశంగా మారింది.

Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >