డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నస్రుల్లాబాద్ మండలం దుర్కి చౌరస్తా వద్ద సోమవారం పోలీసులు భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు బాన్సువాడ ఏఎస్ఐ సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో డీసీఎం వాహనం లో తరలిస్తున్న దాదాపు 12 టన్నుల బియ్యను పట్టుకుట్లు పోలీసులు చెప్పారు. ఈ బియ్యం హైదరాబాద్ నుంచి గాంధారి మీదుగా కోటగిరిలోని ఓ రైస్ మిల్ కు తరలిస్తున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు డీసీఎం వ్యాన్ ను నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
News
పక్కదారి పడుతున్న పి డి ఎస్ బియ్యం పట్టివేత