| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

డైలీ భారత్, నౌగామ్: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద భారీ పేలుడు జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. కానీ ఫరీదాబాద్ లో సీజ్ చేసిన పేలుడు పదార్థాలు అనూహ్య రీతిలో కాశ్మీర్లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ శుక్రవారం రాత్రి అవి పేలిపోయాయి..

శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించ డంతో పోలీసులతోపాటు ఫోరెనిక్స్ నిపుణులు బలయ్యారు. 9 మంది పోలీస్ అధికారులు మృతిచెందగా.. మరో 27 మంది గాయపడ్డట్లు తెలిసింది..వివరాల్లోకి వెళితే... ఇటీవల ఓ ఉగ్రవాద ముఠా నుంచి పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 

వాటిని ఫోరెన్సిక్ బృందం సాయంతో పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా అవి పేలిపోయాయి. దీంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణం దద్దరిల్లింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు, నయీబ్ తహసీల్దార్ సహా ఇద్దరు రెవెన్యూ అధికారులు అక్కడికక్కడే మృతి చెందారు.

గాయపడిన వారిని హుటా హుటిన సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి, షేర్-ఏ-కశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్కిమ్స్ కు తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. ఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులు నౌగామ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఇటీవల జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన పోస్టర్ల కేసును ఛేదించింది ఇదే నౌగామ్ పోలీస్ స్టేషన్. ఈ దర్యాప్తులోనే వైద్యులు వంటి ఉన్నత విద్యావంతు లతో నడుస్తున్న "వైట్ కాలర్ ఉగ్రవాద నెట్‌వర్క్" గుట్టురట్టయింది. ఈ ముఠా నుంచే భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఇటీవల ఢిల్లీలో 13 మందిని బలిగొన్న కారు బాంబు పేలుడుకు కూడా ఇదే ముఠా కారణమని దర్యాప్తులో తేలింది. అప్పు డు స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలే ఇప్పుడు ఈ అధికారుల పాలిట మృత్యుపాశంగా మారడం తీవ్ర విషాదాన్ని నింపింది.

Previous జిల్లాలో సందడి చేస్తున్న సైబీరియన్ కొంగలు
Next అతివేగంతో అదుపుతప్పి లారీని డీకొన్న నిజామాబాద్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు
ADVERTISEMENT