డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు జరపడం తీవ్ర కలకలం రేపింది. మధ్యాహ్నం సమయంలో కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు ఆఫీసులో రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ల వివరాలపై జల్లెడ పట్టారు. అలాగే అధికారులు, సిబ్బందిని విచారించడంతో పాటు పూర్తి వివరాలను రాబడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి అంటూ ఏ పని జరిగిన మొదలు డబ్బు ఇవ్వనిదే ఫైలు కదలని చందం గా పరిస్థితి మారిందని పెద్ద ఎత్తున స్థానికంగా విమర్శలు సైతం వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు .. ఎవరైనా ఫిర్యాదు చేస్తే గాని దాడి చేశారా..? లేక ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారా అనే విషయం లో స్పష్టత రాలేదు. సోదాల అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
News
నిజామాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు