| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బాంబర్‌ ఉమర్‌ నబీ ఇంటిని నేలమట్టం చేసిన అధికారులు

బాంబర్‌ ఉమర్‌ నబీ ఇంటిని నేలమట్టం చేసిన అధికారులు

డైలీ భారత్, న్యూఢిల్లీ:ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ ఘోర ఘటనపై దర్యాప్తు వేగంగా సాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఎర్రకోట వద్ద పేలుడు జరిగిన హ్యుందాయ్‌ ఐ20 కారును నడిపిన ప్రధాన నిందితుడు డాక్టర్‌ ఉమర్‌ నబీ ఇంటిని భద్రతా దళాలు ధ్వంసం చేశాయి.

జమ్ముకశ్మీర్‌ పుల్వామాలోని అతడి నివాసాన్ని గురువారం అర్ధరాత్రి తర్వాత కూల్చివేత ప్రక్రియ ప్రారంభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

దిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో భాగంగానే ఈ చర్య చేపట్టినట్లు తెలిపాయి. గత సోమవారం ఎర్రకోట వద్ద జరిగిన ఈ పేలుడులో 13 మంది దుర్మరణం పాలయ్యారు.

Previous దేవి రోడ్డు లోని వన్ వే ను క్షేత్రస్థాయిలో కాలినడకన పర్యవేక్షించిన సిపి సాయి చైతన్య
Next నిజామాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు
ADVERTISEMENT