| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అధిక శబ్దం చేసే సైలెన్సర్లను రోడ్ రోలర్ తో తొక్కించిన పోలీసులు

అధిక శబ్దం చేసే సైలెన్సర్లను రోడ్ రోలర్ తో తొక్కించిన పోలీసులు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఇక జైలుకే

అడ్మినిస్ట్రేటివ్ డిసిపి బస్వా రెడ్డి

డైలీ భారత్, నిజామాబాద్: రోడ్లపై అధిక శబ్దం చేసే సైలెన్సర్లను అమర్చి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనాలపై ట్రాఫిక్​ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రాంతంలో నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో బుధవారం శబ్ద  బుధవారం కాలుష్యానికి  కారణమవుతున్న బైక్​ల సైలెన్సర్లను తొలగించి రైలేస్టేషన్ ప్రాంతంలో ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ డిసిపి బసవ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో రోడ్లపై అధిక శబ్దాలను చేసే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను తీసివేసి రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేసినట్లు ఆయన అన్నారు. ఇకపై తమ ద్విచక వాహనాలకు వాహనదారులు అధిక శబ్దం వచ్చేలా సైలెన్సర్లను బిగిస్తే కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడితే ఇకపై జైలుకే పంపడం జరుగుతుందని దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని ఆయన అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా ఎదురుగా సురక్షితంగా వచ్చేవారు కూడా ఇబ్బందుల పాలవుతారని అందుకే సిపి ఆదేశాల మేరకు ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పానీయాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. ఒక్కసారి ఈ కేసులలో ఇరికితే జీవితాంతం కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని అందుకే వీటి వలలో ఎవరూ పడకూడదు అని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసిపి మహమ్మద్ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Previous నిజంగా ఆ పెద్ద మనిషికి ప్రభుత్వ సలహాదారుడిగా సంతృప్తినిచ్చిందా..?
Next పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నవదుర్గ మాత ఆలయ 5వ వార్షికోత్సవ మహోత్సవం
ADVERTISEMENT