రాజ రాజేశ్వరుడికి అభిషేక పూజలు
డైలీ భారత్, వేములవాడ:వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధు శేఖర భారతి మహాస్వామి సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయంలోకి పూర్ణకుంభంతో అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అభిషేక పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతి రాజ రాజేశ్వరీదేవికి పూజలు చేశారు.
పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బి గితే. ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి
కార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.