| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పిల్లల ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

పిల్లల ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

గుడిమల్కాపూర్‌ పిల్లల ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

డైలీ భారత్, హైదరాబాద్‌: మహా నగరంలోని గుడిమల్కాపూర్‌ లో గల అంకుర పిల్లల హాస్పిటల్‌ లో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

అంకుర హాస్పిటల్‌లో మంటలు ఒక్కసారిగా ఎగసిపడుతున్నాయి. డీఆర్ఎఫ్ బృందాలు,ఫైర్‌ సిబ్బంది , పోలీసులు 4 ఫై రింజన్లు మంటలార్పేందు కు ప్రయత్నిస్తున్నారు.

ఆస్పత్రి భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. అగ్ని ప్రమాద ఘటనతో అప్రమత్తమైన అంకుర హాస్పిటల్‌ సిబ్బంది రోగులను బయటకు తీసు కొచ్చేందుకు ప్రయత్నిస్తు న్నారు.

ఆస్పత్రి నిర్వహిస్తున్న ఆరు అంతస్తుల భవనం మొత్తం మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.తొలుత ఆరో అంతస్తులో మొదలైన మంటలు క్రమంగా మొదటి అంతస్తు వరకు వ్యాపిం చాయి.

ఆస్పత్రిలో రోగులు చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో రోగులు ఆందోళనలో ఉన్నారు. ఆయా ఫ్లోర్‌లో ఉన్న రోగులను సిబ్బంది బయటికి పంపించి వేస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది...

Previous డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు
Next జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం : ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్
ADVERTISEMENT