| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణ విశ్వవిద్యాలయ అభివృద్ధి కాంగ్రెస్ తోని సాధ్యం

తెలంగాణ విశ్వవిద్యాలయ అభివృద్ధి కాంగ్రెస్ తోని సాధ్యం

ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణు రాజ్

యూత్ కాంగ్రెస్ నాయకులు మోయిన్, మాజీ కార్పొరేటర్ గడుగు రోహిత్ ల ఆధ్వర్యంలో సంబరాలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసిన సందర్భంగా  ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణు రాజ్ ఆధ్వర్యంలో  ఎన్టీఆర్ చౌరస్తా వద్ద  సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ల చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి అనంతరం పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేణు రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. విశ్వవిద్యాలయాలు స్థాపించాలన్న వాటిలో విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు బాటలు వేయాలన్న అధి కేవలం కాంగ్రెస్ పార్టీ తోనే అని ఆయన అన్నారు. గత పది సంవత్సరాలుగా తెరాస ప్రభుత్వంలో కలగానే మిగిలిపోయిన తెలంగాణ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల కాంగ్రెస్ ప్రభుత్వంలో సాకారం అయిందని, దీనికి గల కారణం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నత విద్య పట్ల ఉన్న  చిత్తశుద్ధినని  ఆయన అన్నారు.

 విశ్వ విద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడంలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ అగ్ర నాయకులందరూ ఎనలేని కృషి చేశారని, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ  మొదట నుండి విశ్వవిద్యాలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వారి నియోజకవర్గంలో విశ్వవిద్యాలయం ఉన్నందున విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్, కళాశాలను తీసుకురావడానికి అనునిత్యం ఇంజనీరింగ్ కళాశాల అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి గుర్తు చేస్తూ ఇంజనీరింగ్ కళాశాల మంజూరులో కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. అలాగే గత పది సంవత్సరాలు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల కేటాయించాలని అనేకసార్లు ధర్నాలు రాస్తారోకోలు అప్పటి ప్రభుత్వ నాయకులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చిన స్పందించలేదని ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇంజనీరింగ్ కళాశాల సాధించడంలో ఎన్ ఎస్ యు ఐ పాత్ర మరువలేనిదని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా విశ్వవిద్యాలయానికి కావలసిన అన్ని వసతులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ,తెలంగాణ విశ్వవిద్యాలయానికి బడ్జెట్లో కేటాయింపులు కూడా మన ఈ ప్రజా ప్రభుత్వంలో పెరుగుతుందని,తెలంగాణ విశ్వవిద్యాలయమే కాకుండా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో. ఎన్ ఎస్ యూ ఐ, కాంగ్రెస్ నాయకులు నవీన్. రమేష్. గంగప్రసాద్, నరేందర్ సింగ్. సాయికిరణ్ ,కౌశిక్. మణి.రాజు. తదితరులు పాల్గొన్నారు.

Previous సుప్రీంకోర్టు తీర్పు పార్టీ ఫిరాయింపులపై బి ఆర్ ఎస్ నిజ స్వరూపం బట్టబయలైంది
Next ఎవరికి వారే తెలంగాణ యూనివర్సిటీలో మా పార్టీ వల్లే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పడబోతుందంటున్న బిజెపి కాంగ్రెస్ పార్టీల ప్రగల్బాలు
ADVERTISEMENT