డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని 39వ డివిజన్ పరిధిలోని ఓల్డ్ ఎన్జీఓఎస్ కాలనీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవనం భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులతో కలిసి ఎమ్మెల్యే కమ్యూనిటీ భవనానికి భూమి పూజ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతు, ప్రజల అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణల అవసరం ఉందని అన్నారు, నిర్మాణానికి ముందుకు వచ్చిన కాలనీ అసోసియేషన్ వారిని అభినందించారు. ఇది స్థానిక కాలనీ వాసులకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.
ప్రజల ఉపయోగం కోసం నిర్మిస్తున్న కమ్యూనిటీ భవనం త్వరతగతిన పనులు ప్రారంభం అయ్యి ప్రజా ఉపయోగంలోకి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మినారాయణ, మాజీ కార్పొరేటర్ క్రిష్ణ, కొండా ఆశన్న, ఇల్లేందుల ప్రభాకర్, పార్షి రాజు కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.