| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కల్లు కాంపౌండ్ వద్ద వ్యక్తి దుర్మరణం

కల్లు కాంపౌండ్ వద్ద వ్యక్తి దుర్మరణం

ఘటనకు గల కారణాలపై విచారణ చేపడుతున్న పోలీసులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరంలోని వీక్లీ మార్కెట్ కల్లు కాంపౌండ్ వద్ద సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు నిజామాబాద్ వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ  రఘుపతి తెలిపారు. 45-50 ఏళ్ల వ్యక్తి కల్లు దుకాణం వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు సమాచారం రాగ 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారన్నారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అయితే ఇది ఇలా ఉండగా ఇటీవల కల్లు కాంపౌండ్ల వద్ద ఇలాంటి ఘటనలు జిల్లాలో తరచుగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. కల్లు కు బానిసైనా వారు వారి వెంట మద్యం వెంట తీసుకొని వచ్చి సేవిస్తుంటారని సమాచారం అలా మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడులు చేసేంతగా చివరికి హత్య చేయడనికి వెనకాడని పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఆబ్కారి శాఖ కళ్ళు దుకాణాలపై కన్నెత్తి కూడా చూడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఉదాహరణ నిజామాబాద్ నగరంలోని  పూలంగ్ ప్రాంతంలో ఉన్న ఓ కల్లు దుకాణంలో సదరు కల్లు దుకాణ యాజమాని బ్లాక్ లో యదేచ్చగా మద్యాన్ని సైతం విక్రయిస్తున్నప్పటికీ ఎక్సైజ్, పోలీస్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం కొసమెరుపు.

Previous కామారెడ్డి మైనారిటీ విద్యార్థికి మైనారిటీ వెల్ఫేర్ సెక్రెటరీ బి శఫిఉల్లా అభినందనలు
Next మద్యం మత్తులో వాహనాలు తోలడం ప్రమాదం : కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా
ADVERTISEMENT