| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నగర శివారులో ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

నగర శివారులో ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలో ఓ ఆటో అదుపుతప్పి బోల్తాకొట్టింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బోర్గాం(పి)లోని సంజీవరెడ్డి కాలనీలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలో నుంచి ఆటో నిజామాబాద్​ నగరం వైపు వస్తుండగా.. మూలమలుపు వద్ద అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న నాలుగో టౌన్​ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

Previous బీరెల్లిలక్మీ అనారోగ్యంతో మృతి, ఆమె భౌతిక గాయానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Next అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రభుత్వం, అధికారులు ఒక కుటుంబం లావుండి అభివృద్ధి కి ముందుకు సాగాలి
ADVERTISEMENT