| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆదివాసులు అన్ని రంగాల్లో రాణించాలి : మంత్రి సీతక్క

ఆదివాసులు అన్ని రంగాల్లో రాణించాలి : మంత్రి సీతక్క

అంబేద్కర్ అందించిన హక్కులను కాపాడుకుందాం

తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ బునియాది కార్యకర్త కార్యకర్త సమ్మేళన్ లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:  రాజ్యాంగం నిర్మాత దాదాసాహెబ్ అంబేద్కర్ అందించిన హక్కులను కాపాడుకుంటూ ఆదివాసులు అందరం అన్ని రంగాల్లో రాణించాలని అప్పుడే సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు లభిస్తుందని ఆమె అన్నారు. రాజకీయ రంగాలతోపాటు, ఆదివాసి మహిళలు, పురుషులు ఒక రాజకీయ రంగంలోనే కాకుండా సమాజంలో ఉన్న అన్ని రంగాల్లో మనకంటూ ఒక గౌరవం లభిస్తు సమాజంలో అన్ని కులాల మాదిరిగానే ఆదివాసులు కూడా ముందుండి అభివృద్ధికి దోహదపడాలని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదివాసులను గుర్తిస్తుందని అందుకే తాను మంచి పదవులు నేడు ఇలా ఉన్నానని ఆమె అన్నారు.


అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఆదివాసుల హక్కులు కాపాడడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కంకణబద్ధంగా పనిచేస్తుందని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్ని కులాలు, మతాలను కలుపుకొని అందరికీ సమన్యాయం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని ఆయన అన్నారు. ఆదివాసులు ఒకప్పుడు మాదిరిగా కాకుండా ఇప్పుడు అన్ని రంగాల్లో ఎదిగారని ఇది ఎంతో సంతోషించే తగ్గ విషయం అన్నారు.

Previous బర్త్ డే వేడుకల పేరుతో అర్ధరాత్రి జిల్లా కేంద్రంలో రౌడీ షిటర్ ల వీరంగం
Next బీరెల్లిలక్మీ అనారోగ్యంతో మృతి, ఆమె భౌతిక గాయానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
ADVERTISEMENT