| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాక్లూరు శివారులోని దాస్ నగర వద్ద ఆర్టీసీ బస్సు కారు డి

మాక్లూరు శివారులోని దాస్ నగర వద్ద ఆర్టీసీ బస్సు కారు డి

కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి

ఆర్టీసీ బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికుల వెల్లడి.

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మాక్లూర్ మండల శివారులో శనివారం ఉదయం చోటు చేసుకుంది. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు మాక్లూర్ నుంచి నిజామాబాద్ వస్తున్న కారును దాస్ నగర్ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన షేక్ మహమ్మదీ (52) అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ప్రయాణిస్తున్న మహమ్మదీ కొడుకు, కోడలు, కూతురికి గాయాలయ్యాయి. వీరిని నగరంలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆర్టీసీ డ్రైవర్ అజాగ్రత్తగా బస్సు నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. మృతురాలి భర్త షేక్ బషీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

Previous ధర్మారం(బి) ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల తో పాటు అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
Next ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్
ADVERTISEMENT