| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఈనెల 28న జరిగే చలో సిద్దిపేట్ 14 రంగాల భవన నిర్మాణ కార్మికులు తరలి రావాలి

ఈనెల 28న జరిగే చలో సిద్దిపేట్ 14 రంగాల భవన నిర్మాణ కార్మికులు తరలి రావాలి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, భవన నిర్మాణ కార్మిక సంఘం, బి ఎన్ ఆర్ కె ఎస్, టి ఎఫ్ టి యు ఫెడరేషన్ల ఆధ్వర్యంలో ఈనెల 28న భవన నిర్మాణరంగా 14 రంగాల కార్మికుల న్యాయమైన హక్కుల కోసం చలో సిద్దిపేట్ సభను నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు కల్లెడ గంగాధర్ పేర్కొన్నారు. నగరంలోని శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 28న సిద్దిపేటలో నిర్వహించే సభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 రంగాల భవన నిర్మాణరంగ కార్మికులు ఆరోజున పనులు మానివేసి మన న్యాయమైన హక్కులు ఆ సభ ద్వారా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. అక్కడ జరిగే సభకు రాష్ట్ర గనుల శాఖామంత్రి వివేక్ వెంకటస్వామి తో పాటు ఇతర మంత్రులు భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దరిపల్లి చంద్రం హాజరుకానున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి భవన నిర్మాణరంగ కార్మికులు 14రంగాల కార్మికులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారని కావున మన జిల్లా నుండి పెద్ద ఎత్తున కార్మికులు తరలి వెళ్దామని ఆయన అన్నారు. గృహ నిర్మాణ రంగం అధ్యక్షుడు పెంచాల వేణు, సెక్రెటరీ ఎస్.కె అరీఫ్, కోశాధికారి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Previous కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పోసిన డైవర్షన్ రోడ్డు, ఒక్క వర్షానికి ఫట్.. ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడుతున్న ప్రజలు
Next గంజాయి కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్, రిమాండ్
ADVERTISEMENT