| Daily భారత్
Logo




జూలై 9 దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి

News

Posted on 2025-07-03 19:05:27

Share: Share


జూలై 9 దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి

జూలై 9 దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె నోటీసు ను యం పి డి ఓ కుఅందజేశిన TUCI నాయకులు

సమ్మె గోడ పత్రికల ను ఆవిష్కరించిన TUCI నాయకులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: 2025 జూలై 9న దేశ వ్యాపితంగా కేంద్ర కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మె పిలుపునిచ్చాయనీ, ఈ సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఏదులాపురం గోపాలరావు పిలుపునిచ్చారు.

గురువారం జూలూరుపాడు మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల తో కలిసి TUCI  రాష్ట్ర కమిటీ ముద్రించిన సమ్మె గోడ పత్రికలను ఆవిష్కరించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జూలై 9 దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె నోటీసు ను  యూనియన్ నాయకుల తో కలిసి జూలూరుపాడు యం పి డి ఓ కు అందజేసారు.

ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ... 

కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఏధేచ్చగా అమలుకు పూనుకున్నది అని ఆరోపించారు. 29 కార్మిక చట్టాలను నవీకరిస్తున్నామనే పేరుతో, గతంలో పోరాడి సాధించిన హక్కును హరిస్తూ, "4 లేబర్ కోడ్స్" తీసుకురావడం జరిగిందని వీటి అమలును నిలిపివేయాలని, కనీస వేతనాలు 26 వేలు ఇవ్వాలని, ఈపీఎఫ్ పెన్షన్ 9 వేలు ఇవ్వాలని, స్కీం వర్కరస్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ని రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీం కోర్టు తీర్పు అమలు చేయాలని, మోటార్, హమాలీ వర్కర్స్ కి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, రైతాంగానికి కనీస మద్దతు ధరను ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించరాదనే డిమాండ్లతో కార్మిక వర్గం ఒక రోజు సమ్మె చేసి, నిరసన తెలపాలని కోరారు. 

జిల్లాలో గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులకు రెండు నుంచి మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని అరకొర జీతాలతో బతుకు లీడుస్తున్న పంచాయతీ కార్మికులకు జీతాలు ప్రతినెల సక్రమంగా అందజేయకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఎకౌంట్లో జమ చెస్తామని ప్రకటించారని మూడు నెలలు అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు కార్మికులకు జీతాలను వారి వ్యక్తిగత అకౌంట్లలో జమ చేయలేదని అన్నారు. 

గతంలో కూడా కొన్ని గ్రామపంచాయతీలలో కార్మికులకు జీతాలు పెండింగ్లో ఉన్నాయని, అడ్డ మీద కూలీలకు ఇస్తున్న వేతనం కూడా కార్మికులకి ఇవ్వని స్థితి ఉన్నదని విమర్శించారు.గొర్రె తోక బెత్తడు అన్న చందంగా ఉన్న జీతాలను కూడా సక్రమంగా నెల నెల ఇవ్వకపోవడంతో పంచాయతీ కార్మికులు వారి కుటుంబాలు వీధనపడే ప్రమాదం ఉన్నదని,తక్షణమే జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. 

 ప్రభుత్వ ఉద్యోగస్తుల మాదరిగానే వ్యక్తిగత అకౌంట్లో జమ చేయాలని,పెండింగ్లో ఉన్న జీతాలను కూడా తక్షణమే అందజేయాలని వారు కోరారు.

2025 జూలై 9న దేశ వ్యాపితంగా కేంద్ర కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మె పిలుపునిచ్చాయనీ, ఈ సమ్మెలో గ్రామ పంచాయతీ కార్మికులు కూడా పాల్గొంటున్నారు అని  తెలిపారు.

ఈ కార్యక్రమంలో TUCI ఏరియా ఉపాధ్యక్షుడు రాయల సిధ్దు,యూనియన్ మండల అధ్యక్షులు నాగు, కార్యదర్శి ధన్వంతరావు, ఉపాధ్యక్షులు వినోద్ నాయకులు గంధం చంటి,నిమ్మటూరి శ్రీను,మహేష్, జబ్బార్, కళ్ళెం శ్రీను,మంగిలాల్, నాగుల ‌మీరా, హుస్సేన్, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >