| Daily భారత్
Logo




నటుడు విజయ్ దేవరకొండ పై అట్రాసిటీ కేసు నమోదు

News

Posted on 2025-06-22 15:51:59

Share: Share


నటుడు విజయ్ దేవరకొండ పై అట్రాసిటీ కేసు నమోదు

డైలీ భారత్, హైదరాబాద్:టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ  మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల జరిగిన "రెట్రో" సినిమా ప్రీ-రిలీజ్ వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ఆదివాసీలను, గిరిజనులను అవమానించేలా ఉన్నాయని పలు గిరిజన సంఘాలు, ఆదివాసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో పాటు పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల మేరకు రాయదుర్గం పోలీసులు విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. హీరో చేసిన వ్యాఖ్యలపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ వివాదం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

తమిళ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి మూలం. ఈ కార్యక్రమంలో ఆయన పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. “పాకిస్తాన్ మీద ఇండియా ఎటాక్ చేయాల్సిన పనే లేదు. అక్కడ ప్రజలకు విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వంపై వాళ్లే ఎటాక్ చేస్తారు” అని ఆయన అన్నారు. ఆ సందర్భంలోనే, “కరెంట్, నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే.. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా, పని లేకుండా కొట్లాడుతారన్నారు. మనమంతా సమష్టిగా కలిసి ఉండాలి” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్లో "500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ బుద్ధి లేకుండా, పని లేకుండా కొట్టుకున్నట్లు" అనే పదజాలంపైనే ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాటలు ఆదివాసీల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, వారిని అమర్యాదగా చిత్రీకరించేలా ఉన్నాయని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి

విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ బాపూనగర్ అధ్యక్షుడు కిషన్‌రాజ్ చౌహాన్ కిషన్ సహా పలు గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. విజయ్ దేవరకొండ ఆదివాసులను, గిరిజనులను కించపరిచేలా, వారి నాగరికతను ప్రశ్నించేలా మాట్లాడారని ఆరోపించారు. ఆదివాసీలు అనాగరికులు కారని, వారికి కూడా తమదైన జీవన శైలి, సంస్కృతి, చరిత్ర ఉన్నాయని గిరిజన సంఘాల నాయకులు స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఈ వ్యాఖ్యలు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నేరమని పేర్కొంటూ పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగానే రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో విజయ్ దేవరకొండ ఈ వివాదం నుండి బయటపడటం అంత సులభం కాదని తెలుస్తోంది. పోలీసులు ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం, అవి ఎవరి మనోభావాలను దెబ్బతీశాయి అనే అంశాలపై కూలంకషంగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో విజయ్ దేవరకొండ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసే అవకాశం కూడా ఉంది. ఒక సెలబ్రిటీగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా విజయ్ దేవరకొండ తన వ్యాఖ్యల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. ఈ వివాదం ఆయన సినీ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఈ ఘటన సెలబ్రిటీలు బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు మరింత సంయమనం పాటించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది.

Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >
Image 1

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

Posted On 2026-06-05 20:16:20

Readmore >
Image 1

ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్‌ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు

Posted On 2026-06-05 20:14:05

Readmore >