| Daily భారత్
Logo




ఇందిరా మహిళా శక్తి చీరలతో చేతినిండా ఉపాధి : ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

News

Posted on 2025-06-17 13:09:25

Share: Share


ఇందిరా మహిళా శక్తి చీరలతో చేతినిండా ఉపాధి : ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

గడువులోగా మొదటి చీర అందించాలి రెండో చీర ఆర్డర్ కు సిద్ధం కావాలి

బతుకమ్మ చీరల బకాయిలు 280 కోట్లు చెల్లించాం

రూ. 50 కోట్లతో యార్న్ బ్యాంకు ఏర్పాటు చేసాము

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమలో ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించిన విప్, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో  సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తితో చేతినిండా పని కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్లలోని గణేష్ నగర్ లో ఉన్న మామిడాల నారాయణ, కొండ సుభాష్ కు మరమగ్గాల యూనిట్లను ప్రభుత్వ విప్, వేములవాడ  ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,  చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులతో కలిసి మంగళవారం చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. 

ఈ  సందర్భంగా వారు కార్మికులతో మాట్లాడారు. వేముల శ్రీనివాస్, మెరుగు శ్రీనివాస్ తదితర కార్మికులతో ప్రిన్సిపల్  సెక్రటరీ, కలెక్టర్ మాట్లాడారు. ప్రతి రోజు ఎన్ని మీటర్ల చీర ఉత్పత్తి చేస్తున్నారని? వారానికి ఎంత ఆదాయం వస్తుందని? అడిగి తెలుసుకున్నారు. చీరల ఉత్పత్తిలో ఏమైనా ఇబ్బంది ఎదురవుతున్నాయని ఆరా తీశారు. తమకు ప్రతివారం రూపాయలు 4000 నుంచి 5000 వరకు ఆదాయం వస్తుందని కార్మికులు వారి దృష్టికి తీసుకెళ్లారు. 

అనంతరం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి, కార్మికులను ఆదుకునేందుకు చేతినిండా పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు. ఇందులో భాగంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇందిరా మహిళ శక్తి కింద చీరల ఉత్పత్తి ఆర్డర్లు అందించామని తెలిపారు.

కార్మికులు, ఆసాములు కోరిన విధంగా ధర నిర్ణయించామని వెల్లడించారు. 

ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని కార్మికులు, ఆసాములకు దాదాపు 8 నెలల పాటు ఉపాధి లభిస్తుందని తెలిపారు. గతంలోని బతుకమ్మ చీరల బకాయిలు దాదాపు 280 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా దశాబ్దాల కల నెరవేరుస్తూ వేములవాడలో రూపాయలు 50 కోట్లతో యార్న్ బ్యాంకు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అవసరమైన యార్న్ అంతా అక్కడ అందుబాటులో పెడుతున్నామని తెలిపారు. ఇతర ప్రభుత్వ శాఖ ఆర్డర్లు సిరిసిల్లకు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడేవారు అని ఇప్పుడు చేతినిండా పని ఉంటుందని స్పష్టం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్డర్లను ఆసాములు, కార్మికులు సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. సెస్ పరిధిలోని బ్యాక్ బిల్లింగ్ సమస్య కోర్టు పరిధిలో ఉందని దానిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. 

ఈ సందర్భంగా చేనేత జౌళి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య మాట్లాడారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కు అవసరమైన ఆర్డర్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందజేస్తున్నామని తెలిపారు. కార్మికులకు ప్రతివారం రూపాయలు 4000 నుంచి 5000 వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇందిరా మహిళల శక్తి చీరల ఆర్డర్ పొందిన వారు మొదటి చీర ఉత్పత్తిని త్వరగా పూర్తి చేసి అందజేయాలని సూచించారు. రెండో చీర ఆర్డర్ కు సిద్ధం కావాలని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకొని మరింత అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >