| Daily భారత్
Logo




సిరిసిల్ల పట్టణం లోని కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి

News

Posted on 2023-12-11 17:33:20

Share: Share


సిరిసిల్ల పట్టణం లోని కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి

డైలీ భారత్ సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణం స్థానిక పద్మశాలి కళ్యాణమండపంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేకే మహేందర్ రెడ్డి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ..మొన్న జరిగినా ఎన్నికల్లో మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో గెలిచినప్పటికిని నైతికంగా తానే విజయం సాధించానని అన్నారు. తన కోటరిని అడ్డుపెట్టుకొని మద్యంతో, మందుతో, ఓటర్లను ప్రభావితం చేశాడని ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ అభివృద్ధి ఏం చేయలేదని, దానికి ఉదాహరణ మున్సిపల్ ఎన్నికల్లో సుమారు 12 మంది రెబల్ అభ్యర్థులు కేటీఆర్ కు వ్యతిరేకంగా నిలబడి విజయం సాధించారని అన్నారు. దీనిబట్టి చూస్తే కేటీఆర్ కు ఇక్కడ ఎంత వ్యతిరేకత ఉందో? అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన సోనియాగాంధీ రుణం తీర్చు కునేందుకు ,తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారు అని తెలిపారు.కేటీఆర్ మాట మీద నిలబడే వ్యక్తి కాదనీ.ఒకప్పుడు కేటీఆర్ వచ్చిన మెజారిటీ కి ఇప్పటి మెజారిటీ కి చాలా వ్యత్యాసం ఉంది అని తెలిపారు. ఇక్కడ ఉన్న వ్యాపారులను సైతం కేటీఆర్ భయభ్రాంతులకు గురి చేశాడని అన్నారు. కేటీఆర్  సిరిసిల్ల లో ఉన్న అన్ని రకాల మాఫియా లను పెంచి పోషిస్తున్నాడు అని అన్నారు.కేటీఆర్ చుట్టూ,దొంగ నోట్ల, వ్యాపారం చేసే వ్యక్తులు,బతుకమ్మ చీరల మాఫియా వ్యక్తులు ,ఇసుక మాఫియా వ్యక్తులు,లాండ్ మాఫియా వ్యక్తులు ఉన్నారనీ విమర్శించాడు.ఈ అన్ని మాఫియా లకు కేటీఆరే నాయకుడని  విమర్శించారు. 15 సంవత్సరాలుగా సిరిసిల్ల ప్రజలకు  అందుబాటులో లేని కేటీఆర్, కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే సిరిసిల్ల ప్రజలకు వారానికి రెండు రోజులు కేటాయిస్తానని ఉత్తరప్రగల్బాలు పలుకుతున్నాడని ఎద్దేవా చేశాడు.

సిరిసిల్ల లో ఉన్న కార్యకర్తలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ప్రతి ఒక్క కార్యకర్తను కాంగ్రెస్ కడుపులో  పెట్టుకొని చూసుకుంటుందని తెలిపారు. రానున్న అన్ని రకాల ఎన్నికల్లో వాడవాడల కాంగ్రెస్ జెండా ఎగరవేసి కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగుల సత్యనారాయణ ,చొప్పదండి ప్రకాష్ ,ఎల్ల లక్ష్మీనారాయణ, గడ్డం నరసయ్య, తదితరులు పాల్గొన్నారు

Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >